ETV Bharat / state

vegetable Prices Rise in Srikakulam: కొండెక్కిన కూరగాయల ధరలు.. జనం బెంబేలు - ఏపీలో కూరగాయల ధరలు

శ్రీకాకుళం జిల్లాలో కూరగాయల ధరలు సామాన్యులను (vegetable Prices Rise in Srikakulam district) బెంబేలెత్తిస్తున్నాయి. కొవిడ్ మహమ్మారి, లాక్‌డౌన్‌తో ఆర్థికంగా చితికిపోయిన ప్రజలపై.. ఈ ధరలు పెను భారం మోపుతున్నాయి.

కొండెక్కిన కూరగాయల ధరలు
కొండెక్కిన కూరగాయల ధరలు
author img

By

Published : Nov 27, 2021, 7:47 PM IST

కొండెక్కిన కూరగాయల ధరలు

శ్రీకాకుళం జిల్లాలో ప్రజల డిమాండ్‌కు సరిపడా కూరగాయల సాగు, సరఫరా లేకపోవడంతో ధరలు (vegetable Prices Rise in Srikakulam over unseasonal rains) ఆకాశాన్నంటుతున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితుల్లో.. మార్కెట్‌లో రోజురోజుకూ ధరలు ఎగబాకుతున్నాయి. సామాన్యులకు కూరగాయల ధరలు అందుబాటులో లేవు. ఏది కొందామన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తోందని ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇంతకుముందు కొనే కూరగాయలతో పోలిస్తే సగం కూడా కొనలేకపోతున్నామంటున్నారు.

రైతు బజార్లలోనే ధరలు మండిపోతుంటే.. ఇక బయటి మార్కెట్లలో అయితే అడ్డూ అదుపూ లేకుండా ఉంటున్నాయి. వ్యాపారులు ఇష్టారీతిన ధరలు పెంచేస్తుండటంతో.. వినియోగదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. జిల్లాలో కూరగాయల సాగు చాలా వరకు తగ్గిపోయింది. అకాల వర్షాల వల్ల.. పంటలు తీవ్రస్థాయిలో దెబ్బతిన్నాయి. ప్రస్తుతం బెండ, వంకాయలు, బీర, కాకర.. చాలా తక్కువ మోతాదులో మార్కెట్‌కు చేరుతున్నాయి. దూర ప్రాంతాల నుంచి దిగుబడులు, వాటికి రవాణా ఛార్జీలు తోడవటం వల్లే.. ధరలు పెరిగాయని మార్కెట్‌ అధికారులు అంటున్నారు.

ధరల పెరుగుదల, నియంత్రణ వంటి అంశాలపై అధికారుల పర్యవేక్షణ కొరవడిందని ఫలితంగానే ఈ పరిస్థితి నెలకొందని సిక్కోలు ప్రజలు అంటున్నారు.

ఇదీ చదవండి

MOTHER MURDERED BABY IN VISAKHAPATNAM: కన్నతల్లి కర్కశత్వం.. నీటి డ్రమ్ములో పడేసి దారుణంగా చంపేసింది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.