Nirvasitula Nirasana శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం మెట్టురు గ్రామంలో శుక్రవారం వంశధార నిర్వాసితులు నిరసన కార్యక్రమం చేపట్టారు. గత కొన్ని ఏళ్లుగా ఉన్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. నిర్వాసితుల సంఘం నాయకుడు గంగరాజు సింహాచలం, యం. అప్పారావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు నిర్వాసితులు పాల్గొన్నారు. తాము సర్వస్వం కోల్పోయి జిల్లా అభివృద్ధికి కృషి చేశామన్నారు.
నేటి ముఖ్యమంత్రి అప్పట్లో నిర్వాసిత ప్రాంతాలను పరిశీలించి 2013 భూ సేకరణ చట్టం అమలు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. స్థానిక ఎమ్మెల్యే సైతం తమను నమ్మించి ఓట్లు వేయించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం చేపట్టి మూడేళ్లు అవుతున్న నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని ఆగ్రహం చెందారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఉద్యమాలు చేయాల్సి వస్తుందని నిర్వాసిత సంఘ సభ్యులు తెలిపారు.
ఇదీ చదవండి: Yogasrita In India Book Of Records: నాలుగేళ్ల చిన్నారి అరుదైన రికార్డ్