శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం పాకివలస సమీపంలో.. ఉదయం జరిగిన ప్రమాదంలో ఒడిశాకు చెందిన ఇద్దరు మృతిచెందారు. ఒడిశా నుంచి విశాఖ వైపు చేపలలోడుతో వెళ్తున్న మినీ వ్యాన్ అదుపుతప్పి జాతీయరహదారి పక్కనున్న నేలబావిలోకి దూసుకుపోయింది. వాహనంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఊపిరాడక మృతిచెందారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని.. వాహనం, మృతదేహాలను బయటికి తీశారు. మృతుల వివరాలు ఇంకా తెలియలేదని పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి...: సముద్రస్నానానికి వెళ్లి... ముగ్గురు ఉత్తరప్రదేశ్ యువకులు గల్లంతు