శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటివరకు ఐదు కరోనా కేసులు నమోదు అయ్యాయి. పాతపట్నం మండలానికి చెందిన నలుగురికి పాజిటివ్‌గా గత నెలలో గుర్తించారు. అప్పటి నుంచి జెమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నలుగురిలో ఇద్దరికి పరీక్షలు నిర్వహించగా.. నెగిటివ్ రావడంతో డిశ్చార్జ్ చేశారు. వీరు పది రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండాలని వైద్యులు సూచించారు. మరో ఇద్దరికి పరీక్షలు నిర్వహించి త్వరలో డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్లు చెబుతున్నారు.
ఇదీ చదవండి :