శ్రీకాకుళం జిల్లా హిరమండలంలో తెలుగుదేశం పార్టీకి చెందిన జడ్పీటీసీ పొగిరి బుచ్చిబాబును గుర్తుతెలియని వ్యక్తులు తుపాకీతో బెదిరించారు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో జడ్పీటీసీ.. తన హోటల్ నుంచి ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు.. మేము పోలీసులమంటూ ఆయన్ను పిలిచారు. తనతో మీకు పనేంటని ప్రశ్నించడంతో తుపాకీతో బెదిరించారు. అప్రమత్తమైన బుచ్చిబాబు.. వారి నుంచి చాకచక్యంగా తప్పించుకున్నారు. ఆ వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జడ్పీటీసీ హోటల్లో సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి బెదిరింపులు.. ఈ వారంలో ఇది రెండో సారి అని ఫిర్యాదులో బుచ్చిబాబు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: