శ్రీకాకుళం జిల్లాలో క్రయవిక్రయాలకు లాక్డౌన్లో ఇప్పటి వరకు అమలు చేసిన సమయాలను కొనసాగించాలని వర్తక వ్యాపార సంఘాల ప్రతినిధులు కోరారు. ఇప్పటివరకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే దుకాణాలు తెరిచేందుకు అనుమతించగా, గురువారం నుంచి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆ సమయాన్ని సవరించారు.
ఈ కారణంగా.. విక్రయాలు తగ్గి తీవ్ర నష్టం కలుగుతుందని వర్తక సంఘాల ప్రతినిధులు నిరసన తెలిపారు. నరసన్నపేటలో వర్తక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఉదయం 10 నుంచి సాయంత్రం వరకు దుకాణాలు తెరిచేందుకు అనుమతులు వల్ల వ్యాపార రంగానికి అనుకూలం కాదని వర్తక సంఘం ప్రతినిధులు తెలిపారు.
ఇదీ చదవండి: