శ్రీకాకుళం జిల్లా పాతపట్నం బాలాజినగర్లో గురువారం అర్థరాత్రి చోరి జరిగింది. అర్థరాత్రి 2 గంటల తరువాత దుండగులు బాలాజీనగర్లో తాళం వేసి ఉన్న ఇళ్లల్లో చొరబడ్డట్లు.. స్థానికుల ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. గేటుకు ఉన్న గడియలను విరగ్గొట్టి దుండగులు లోపలకు ప్రవేశించారు.
రెండు రోజుల కిందట స్వగ్రామానికి వెళ్లిన డా.అనిత ఇంట్లో రూ.1.5లక్షల విలువగల బంగారు ఆభరణాలను అపహరించారు. శ్రీకాకుళం వచ్చిన క్లూస్ టీం.. గేటు, బీరువా తలుపులపై ఉన్న వేలిముద్రలను సేకరించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహమ్మద్ అలీ తెలిపారు.
ఇదీ చదవండి: