మూడు రాజధానులపై అధికారిక ప్రకటన రాకముందే ఇలాంటి ఆరోపణలు సరికాదన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. శ్రీకాకుళం జిల్లా రాగోలు తోటలో నిర్వహించిన తూర్పు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ కలయికలో పాల్గొన్న ఆయన.. తెదేపా హయాంలో భూఆరోపణలు వచ్చినా ఏనాడు విచారణ జరపలేదన్నారు. 13 జిల్లాల సమగ్ర అభివృద్ధి వైకాపా ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఒక ప్రాంతానికి లబ్ది చేకూర్చి... మరో ప్రాంతాన్ని విస్మరించాలన్న ఉద్దేశ్యం మాకు లేదన్నారు. అమరావతిలో బాలకృష్ణ వియ్యంకుడికి 4 వందల 98 ఎకరాలు కట్టబెట్టారని.. రాజధాని ప్రాంతంలో అక్రమాలు జరిగాయనడానికి ఇదొక నిదర్శనమన్నారు. చంద్రబాబులా తమకు అవకాశవాద రాజకీయాలు తెలియవన్నారు మంత్రి బొత్స.
ఇదీ చదవండి:'రాజధానిపై ఆ కమిటీ నివేదికదే తుది నిర్ణయం'