శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌కు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి, మాజీ ఎంపీపీ, తెదేపా సీనియర్ నేత బెందాళం ప్రకాశ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆదివారం తుదిశ్వాస విడిచారు. తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే అశోక్‌ను ఫోన్లో పరామర్శించారు. ప్రకాశ్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.
ఇదీచదవండి.