శ్రీకాకుళం ఏడు రోడ్ల కూడలిలోని అన్న క్యాంటీన్ వద్ద తెదేపా ఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవితో కలిసి ఎంపీ కింజరాపు రామ్మెహన్నాయుడు పాల్గొన్నారు. ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఉంటే శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని ఎంపీ డిమాండ్ చేశారు. వైకాపా సర్కారు అధికారం చేపట్టి తొమ్మిది నెలలు గడిచినా రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు.
ఇదీ చదవండి: