ETV Bharat / state

ఈఎస్‌ఐ మందుల కొనుగోలు అక్రమాల్లో అచ్చెన్నాయుడు అరెస్ట్ - atchemnaidu arrest news

శుక్రవారం ఉదయం.. శ్రీకాకుళం జిల్లాలోని స్వగ్రామం నిమ్మాడలో ఉన్న మాజీమంత్రి అచ్చెన్నాయుడి ఇంటికి పెద్దసంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. ఇంట్లో వారికి.. ఊరిలో వారికి కూడా ఏం జరుగుతుందో అర్థం కాలేదు. గోడ దూకి మరీ అచ్చెన్న ఇంట్లోకి వెళ్లిన పోలీసులు ఆయన్ను ఆరెస్టు చేస్తున్నట్లు చెప్పారు. క్షణాల వ్యవధిలోనే ఆయన్ను వాహనంలో ఎక్కించుకుని విజయవాడకు తీసుకొచ్చారు. శుక్రవారం జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తేదేపా శ్రేణులు భగ్గుమన్నాయి. ఇది ప్రభుత్వం చేసిన కుట్రగా అభివర్ణించాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ అచ్చెన్న పట్ల వ్యవహరించిన తీరుపై అభ్యంతరం తెలిపాయి.

atchem naidu arrest
అచ్చెన్నాయుడి అరెస్ట్ వ్యవహారం
author img

By

Published : Jun 12, 2020, 8:55 PM IST

తెలుగుదేశం శాసనసభాపక్ష ఉపనేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడును.... అవినీతి నిరోధక శాఖ అరెస్టు చేయడం.... రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని అచ్చెన్నాయుడు ఇంటికి ఉదయం 7.30 గంటలకు వెళ్లిన పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈఎస్ఐ మందుల కొనుగోళ్లు, ఇతర వ్యవహారాల్లో అవినీతికి పాల్పడ్డారంటూ ఆయనకు నోటీసులు ఇచ్చారు. పోలీసులు వారితో రాగా... కొందరు గోడదూకి అచ్చెన్న ఇంట్లోకి ప్రవేశించారు. రాగానే ఇంట్లోవాళ్ల ఫోన్లు లాగేసుకుని... ఐదు నిమిషాల్లోనే అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఆ సమయంలో... అచ్చెన్న వెంట గన్‌మ్యాన్‌నూ కూడా అనుమతించలేదని కుటుంబ సభ్యులు తెలిపారు.

దర్యాప్తులో తేలింది...అందుకే అరెస్ట్ చేశాం..

ఉదయం ఏడున్నరకి అచ్చెన్నను అరెస్టు చేశామని అవినీతి నిరోధక శాఖ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ విశాఖలో మీడియాకు వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా.. మందులు, కొన్నిరకాల పరికరాలు కొనుగోళ్లు చేసినట్లు వివరించారు. ఈ వ్యవహారంపై విజిలెన్స్ విభాగం రూపొందించిన నివేదికను ప్రభుత్వం తమకు సిఫారసు చేసిందని... దానిపై దర్యాప్తులో లభించిన ఆధారాలతో అచ్చెన్నతో పాటు ఆరుగురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

ఇదే కేసులో రాజమహేంద్రవరంలోని ఈఎస్ఐ ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్‌ విజయకుమార్‌ను తుమ్మలోవలో... మాజీ డైరెక్టర్ రమేష్‌కుమార్‌ను.. తిరుపతి బైరాగిపట్టెడలోని నివాసంలో అరెస్టు చేశారు. గతంలో కడప ఈఎస్ఐ ప్రాంతీయ కార్యాలయంలో జేడీగా పనిచేసిన జనార్ధన్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.

జగనే బాధ్యత వహించాలి: చంద్రబాబు

అచ్చెన్నాయుడి అరెస్ట్‌కి జగన్‌నే బాధ్యత వహించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. హోంమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వ అరాచకాలకు అదుపు లేకుండా పోయిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రభుత్వ దోపిడీకి అడుగడుగునా... అడ్డు పడుతున్నామన్న అక్కసుతోనే.... అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ప్రజాప్రతినిధిగా ఉన్న అచ్చెన్న పట్ల.... పోలీసులు ప్రవర్తించిన తీరు గర్హనీయన్నారు. విజిలెన్స్ నివేదికలో అచ్చెన్నాయుడు పేరే లేదన్న చంద్రబాబు.... కేవలం అవమానించడానికే దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. అచ్చెన్నాయుడికి మద్దతుగా రాష్ట్రమంతటా శనివారం తెలుగుదేశం ఆధ్వర్యంలో నిరసన చేపట్టనున్నట్లు చంద్రబాబు తెలిపారు.

భగ్గుమన్న పార్టీ వర్గాలు...

అచ్చెన్నాయుడి అరెస్ట్‌పై ఆ పార్టీ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మండిపడ్డారు. అసెంబ్లీలో ఎదుర్కొనే ధైర్యం లేకనే జగన్ సర్కార్.... తమ నేతలను టార్గెట్ చేస్తోందని తెదేపా ఎమ్మెల్సీ బీటీ.నాయుడు ఆరోపించారు. అచ్చెన్నాయుడు అరెస్ట్.... వైకాపా ప్రభుత్వ అరాచకానికి నిదర్శనమని మాజీ మంత్రి పీతల సుజాత ఆక్షేపించారు. విజయవాడలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. విలేకరులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఏసీబీ అధికారులు తడబడ్డారని గద్దె రామ్మోహన్ విమర్శించారు. బీసీల గొంతు నొక్కే ప్రయత్నమే అచ్చెన్నాయుడు అరెస్టని మండిపడ్డారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించేవారందరిపై తప్పుడు కేసులు పెడుతున్నారని తెదేపా సీనియర్ నేత యరపతినేని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్టులకు భయపడే సమస్యే లేదని స్పష్టం చేశారు.

విజయవాడలో...

అచ్చెన్నాయుడిని విజయవాడ అనిశా కార్యాలయానికి అధికారులు తీసుకువచ్చారు. ఈఎస్​ఐ ఆస్పత్రిలో కరోనా పరీక్షల అనంతరం ఆయన్ను ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు.

ఇవీ చదవండి:

అచ్చెన్నాయుడిపై ఈఎస్​'ఐ'.. ఏసీబీ ఏం చెబుతుందంటే..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.