ETV Bharat / state

రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది: కళా వెంకట్రావు - కళా వెంకట్రావు

TDP Leader Kala Venkata Rao Fires on YSRCP: రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని తెలుగుదేశం నేత కళా వెంకట్రావు విమర్శించారు. కరెంట్​ కోతలు - బిల్లుల మోతలతో ప్రభుత్వం ప్రజలను ఎన్నడూ లేనివిధంగా ఇబ్బందులకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం బుడగట్లపాలెంలో నిర్వహించిన 'బాదుడే - బాదుడు' కార్యక్రమంలో పాల్గొన్నారు.

Kala Venkata Rao fire on ysrcp
తెలుగుదేశం నేత కళా వెంకట్రావు
author img

By

Published : Apr 28, 2022, 10:38 PM IST

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తోందని.. త్వరలోనే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని మాజీ మంత్రి, తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు అన్నారు. జగన్ రెడ్డి పాలనలో కరెంట్​ కోతలు - బిల్లుల మోతలతో.. ప్రజలు ఎన్నడూ లేనివిధంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం బుడగట్లపాలెం గ్రామంలో నిర్వహించిన 'బాదుడే - బాదుడు' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. గ్రామంలో ర్యాలీ నిర్వహించిన తెదేపా శ్రేణులు.. ప్రతీ ఇంటికి వెళ్లి అగ్గిపెట్టె -కొవ్వొత్తులు, విసన కర్రలు పంపిణీ చేశారు. సర్కార్​ వైఫల్యాలను ఎండగడుతూ.. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు.

అనంతరం స్థానికంగా నిర్వహించిన ప్రజా సమస్యల - చర్చావేదిక(గౌరవ సభ) కార్యక్రమంలో కళా వెంకట్రావు పాల్గొన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక నిత్యావసర, చమురు ధరల పెంపు గురించి వివరించారు. అలాగే.. తెలుగుదేశం హయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇదీచదవండి: రణరంగంగా మారిన దుగ్గిరాల.. లోకేశ్​పై దాడికి యత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.