ETV Bharat / state

'నంద్యాల ఘటనలో పోలీసులపై నామమాత్రపు కేసులు పెట్టారు' - నంద్యాల ఆత్మహత్యల ఘటనపై టీడీపీ కామెంట్స్

నంద్యాలలో మైనార్టీ కుటుంబం ఆత్మహత్యలకు ప్రధాన కారకులకు ఆరు గంటల్లోనే బెయిల్ వచ్చిందని, రాజధాని కోసం పోరాటం చేస్తున్న వారికి ఇప్పటికీ బెయిల్ రాకపోవడం గమనార్హమని తెదేపా నేత రమణమూర్తి విమర్శించారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.

Tdp ex mla baggu ramana murthy
Tdp ex mla baggu ramana murthy
author img

By

Published : Nov 10, 2020, 3:35 PM IST

రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని నరసన్నపేట తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆరోపించారు. నంద్యాలలో సలాం కుటుంబం ఆత్మహత్య కేసు దర్యాప్తుపై శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో మాట్లాడారు. ముస్లిం కుటుంబం ఆత్మహత్యకు కారణాలు తెలియజేస్తూ వీడియో విడుదల చేస్తే.. పోలీసులు తూతూమంత్రంగా కేసులు పెట్టి చేతులు దులుపుకున్నారని రమణమూర్తి ఆరోపించారు.

కేవలం ఆరు గంటల్లోనే...అరెస్టైన పోలీసులకు బెయిల్ దొరకడం ఇందుకు నిదర్శనం అన్నారు. అదే రాజధాని రైతులు శాంతియుతంగా ఉద్యమం చేస్తే ఇప్పటికీ బెయిల్ లేకపోవడం గమనార్హం అంటూ రమణ మూర్తి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ సామాజిక వర్గాలపై ప్రభుత్వం కక్షపూరిత విధానం అవలంబిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి

'రబీ సీజన్​లో 8లక్షల 10వేల ఎకరాలకు సాగునీరు అందిస్తాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.