శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు... నియోజకవర్గాల వారీగా పార్టీ స్థితిగతులు సమీక్షిస్తున్నారు. పలాస నియోజకవర్గం నేతలు, కార్యకర్తలతో సమావేశమైన చంద్రబాబు... వారికి దిశానిర్దేశం చేశారు. అంతకు ముందు నేతలతో జరిగిన సమావేశంలో వైకాపా పాలనపై చంద్రబాబు మండిపడ్డారు. ఇసుక ఉచితంగా ఇస్తానంటే విమర్శలు చేశారని... ఇప్పుడు అందర్నీ రోడ్డున పడేశారని విమర్శించారు. కొరత తీర్చలేని దుస్థితులో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎండాకాలం రాక ముందే విద్యుత్ కోతలు మొదలయ్యాయంటూ ఎద్దేవా చేశారు.
శ్రీకాకుళం జిల్లాలో నియోజకవర్గాల వారీగా చంద్రబాబు సమీక్ష - latest chandrababu news in palasa
శ్రీకాకుళం జిల్లాలో నియోజకవర్గాల వారీగా తెదేపా అధినేత చంద్రబాబు సమీక్షలు నిర్వహిస్తున్నారు. పలాస నియోజకవర్గం నేతలు, కార్యకర్తలతో సమావేశమై దిశానిర్దేశం చేశారు.