ETV Bharat / state

ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేర్చటమే ప్రభుత్వ లక్ష్యం: సభాపతి తమ్మినేని - Tammineni Sitaram

ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేర్చాలనే ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి జగన్.. జగనన్న కాలనీల నిర్మాణాన్ని చేపట్టారని శాసనసభాపతి తమ్మినేని సీతారం అన్నారు. పేదలందరికీ పక్కా ఇళ్లు అందించేందుకు సీఎం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని చెప్పారు.

Tammineni Sitaram foundation stone for the Jagananna colonies at srikakulam
ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేర్చాటమే ప్రభుత్వ లక్ష్యం
author img

By

Published : Jul 4, 2021, 8:56 PM IST

రాష్ట్రంలో నిరుపేదలకు పక్కా ఇళ్లు అందించేందుకు ముఖ్యమంత్రి జగన్ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని శాసనసభాపతి తమ్మినేని సీతారం చెప్పారు. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం వాహం, ఉవ్వపేట గ్రామాల్లో జగనన్న కాలనీల ఇళ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.

ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేర్చాలనే ఉద్దేశ్యంతో జగనన్న కాలనీల నిర్మాణాన్ని చేపట్టామన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

Pattabi: 'అమరావతిలో భూ దోపిడీ అంటూ.. మళ్లీ ఆవు కథ మొదలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.