శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్యనారాయణస్వామి దేవాలయంలో దర్శనాలు ప్రారంభం అయ్యాయి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. ఈరోజు నుంచి భక్తులకు దర్శనాలకు అనుమతులను ఇచ్చారు. లడ్డూ ప్రసాదం అందుబాటులో ఉంచారు.
ఆలయానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ఈవో సూర్యప్రకాశ్ తెలిపారు. భౌతిక దూరం పాటిస్తూ క్యూ లైనులో గీసిన వృత్తంలో ఉండి స్వామిని దర్శించుకోవాలని కోరారు. వెంట గుర్తింపు కార్డు తెచ్చుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి: