శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారిని భానుడి లేలేత కిరణాలు ఈ ఉదయం తాకాయి. ఉదయం తొమ్మిది నిమిషాల పాటు సూర్య కిరణాలు మూలవిరాట్టును స్పృశించినట్లు ప్రధానార్చకులు తెలిపారు.. ఉత్తరాయణం, దక్షిణాయణం మార్పుల్లో స్వామిని ఆదిత్యుని కిరణాలు తాకటం ఆనవాయితీ. ప్రతీయేటా మార్చి 9, 10 తేదీల్లో... తిరిగి అక్టోబర్ 1, 2 తేదీల్లో .... రవి కిరణాలు స్వామి వారిని స్పృశిస్తాయి. ఆ అద్భుత ఘట్టం ఇవాళ ఆవిష్కృతం అయింది. ఈ అపురూప దృశ్యం చూసి భక్తులు పులకించిపోయారు.
ఇదీ చదవండి : Thirumala : కళారూపాలుగా శ్రీవారి పూజా పుష్పాలు..!