శ్రీకాకుళం జిల్లా రాజాం జీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో జాతీయ స్థాయి స్టెప్కొన్ - 2020 పోటీలను ఇస్రో అంతరిక్ష శాస్త్రవేత్త, చంద్రయాన్, మంగళయాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పద్మశ్రీ డా.మైల స్వామి అన్నాదురై ప్రారంభించారు. దేశంలోని వివిధ విద్యా సాంకేతిక సంస్థల ఇ- ప్రతినిధులుగా 4 వేల మంది విద్యార్థులు తమ ప్రతిభ పాఠవాలు ప్రదర్శించనున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల్లో విద్యార్థులు ప్రాజెక్ట్ డిజైన్ కాంటెస్ట్, ఇండస్ట్రీ డిజైన్ ప్రాబ్లమ్స్, డోన్ వాయిజ, రోబో రేస్, రోబో సాకర్, పేపర్ ప్రజెంటేషన్, టెక్నికల్ ఈవెంట్స్, యూత్ టాక్, ఐడియా ఫ్యాక్టరీ, వర్క్ షాపులు తదితర ప్రదర్శనలు చేపట్టనున్నట్లు కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రాజా మరుగు దాస్ తెలిపారు. జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించడం ఇది నాలుగోసారని తెలిపారు. విద్యార్థులలో నూతన విజ్ఞానం ఆవిష్కరించడం పట్ల పెరుగుతున్న ఉత్సుకతకు ఇది నిదర్శనమన్నారు.
ఇవీ చూడండి: