నాలుగో దశ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలంలో పోలింగ్ సిబ్బంది కొరత వేధిస్తోంది. పలువురు పోలింగ్ సిబ్బంది విధులకు డుమ్మా కొట్టగా... రిజర్వ్ సిబ్బందీ హాజరుకాకపోవడం సమస్యకు కారణమైంది. రిజర్వులో 129 మంది పీవోలు, 116 మంది ఏపీవోలు, ఏడుగురు ఆర్ఓలుగా నియమితులయ్యారు. వీరిలో చాలామంది విధులకు హాజరుకాలేదు. సమస్య జిల్లా కలెక్టర్ దృష్టికి రావడంతో ఎన్నికల విధులకు ఉపాధ్యాయులను నియమించారు.
ఇదీ చదవండి: నరసన్నపేటలో నాలుగో విడత పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి