శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం అధ్యక్ష పీఠం ఆశించిన దువ్వాడ శ్రీకాంత్ నిరాశకు లోనయ్యారు. కొద్దిరోజులుగా అధ్యక్ష పీఠం రేసులో బళ్ల గిరిబాబు, దువ్వాడ శ్రీకాంత్‌ల పేర్లు వినిపిస్తుండగా.. శ్రీకాంత్ పేరు ఖరారు కాలేదు. 17 వ వార్డు నుంచి వైకాపా తరఫున ఎన్నికైన దువ్వాడ శ్రీకాంత్‌ను ఛైర్మన్ ఎంపికకాకపోవటంతో ఆవేదనకు గురయ్యారు. కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని మంత్రి సీదిరి అప్పలరాజు సూచించినా... శ్రీకాంత్ వెళ్లలేదు. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడ్డ తనను ఇప్పుడు విస్మరించారని కన్నీటి పర్యంతమయ్యారు.
ఇదీచదవండి