Srikakulam's Srimukhalingam Temple is Far from Development : దక్షిణ కాశీగా పేరొందిన శ్రీముఖలింగేశ్వరుడి పుణ్యక్షేత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఆలయ నిర్వహణపై నిర్లక్ష్యంతో శిల్ప సంపద శిథిలమైపోతోంది. వందల ఏళ్ల నాటి పురాతన శాసనాలు, శిల్పాలు పెచ్చులూడిపోతున్నాయి. కనీస సదుపాయాలు లేకపోవడంలో భక్తులు, పర్యటకులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
శిథిలావస్థకు చేరుకుంటున్న శతాబ్దాల నాటి పుణ్యక్షేత్రం.. పట్టించుకోని అధికారులు
Sri Mukhalingam Temple - Popular Shiva Temple In Andhra : కాశీలో లింగం, గంగలో స్నానం, శ్రీశైలంలో శిఖరం, శ్రీముఖలింగంలో దర్శనంతో మోక్షం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం శ్రీముఖలింగంలో వెలసిన శ్రీముఖలింగేశ్వర స్వామి దేవాలయం దక్షిణ భారతదేశంలో రాతితో నిర్మించిన ఏకైక దేవాలయంగా ప్రసిద్ధి పొందింది. ఒకటి తక్కువ కోటి లింగాల క్షేత్రంగానూ ఖ్యాతినార్జించింది. ఆలయంలో కైలాసనాథుడు లింగముఖ రూపంలో దర్శనిమిస్తున్నందునే శ్రీముఖలింగంగా పిలుస్తారు. ఈ ఆలయాన్ని పదో శతాబ్దానికి ముందు రెండో కామార్ణవుడు అనే రాజు కట్టించారని శాసనాల ద్వారా తెలుస్తోంది.
జ్యోతిర్లింగ క్షేత్రంలో కార్తిక శోభ - అంగరంగ వైభవంగా లక్ష దీపోత్సవం
Sri Mukhalingam Temple : ఎంతో గొప్ప చరిత్ర ఉన్న ఈ పుణ్యక్షేత్రాన్ని ఏటా లక్షల మంది భక్తులు దర్శించుకుంటారు. అయితే శ్రీముఖలింగంలో పర్యాటకలను అబ్బురపరిచే శిల్ప సౌందర్యం కాలక్రమేణా దెబ్బతింటోంది. రాతిపై అద్భుతంగా చిత్రించిన చిత్ర కళా సౌందర్యం నిర్వహణా లోపంతో పాడైపోతోంది. ఆలయం లోపలి గోడలు పెచ్చులూడుతున్నాయి. దేవీ దేవతల విగ్రహాల ముఖం, చేతులు, కాళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. అవి కిందపడిపోయి రూపు మారుతున్నాయి.
బ్రహ్మంగారి ఆలయంలో పీఠం కోసం పోటీ.. రంగంలోకి ఇతర మఠాధిపతులు!
No Development In Sri Mukhalingam Temple : చాలా కాలంగా ఈ క్షేత్ర అభివృద్ధికి 50 కోట్ల నిధులతో ప్రతిపాదనలు పంపినా ఇప్పటికీ మంజూరు కాలేదు. గత ప్రభుత్వ హయాంలో మాస్టర్‌ప్లాన్ రూపొందించి 20 కోట్ల మంజూరుకు ఆమోదముద్ర పడినా ఈ లోపు వైసీపీ పాలన రావడంతో నిధులు విడుదల కాలేదు. దీనివల్ల ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అవసరమైన సత్రాలు, ఇతర మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా వేధిస్తోంది. అయినా పాలకులు పట్టించుకోవడం లేదు.
కాశీలోని పిశాచ్‌మోచన్‌కుండ్ ప్రత్యేకత తెలుసా?
'ఆలయాన్ని అభివృద్ధి చేసి, మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే పర్యాటకుల రాక పెరుగుతుంది. నిధులు మంజూరు అయితే భక్తులకు సరైన సౌకర్యాలు అందించవచ్చు.' శివాజీ శర్మ, (అర్చకులు) ప్రభాకరావు, (ఈఓ)