ETV Bharat / state

ఉగ్రవాదుల కాల్పుల్లో సిక్కోలు జవాను వీరమరణం

ఉగ్రవాదుల కాల్పుల్లో శ్రీకాకుళం జవాను మృతి చెందారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఖోన్సా సరిహద్దు సమీపంలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో వజ్రపుకొత్తూరుకు చెందిన జవాను బాబురావు అమరులయ్యారు.

Srikakulam soldier  was killed in a terrorist firing in Arunachal Pradesh.
ఉగ్రవాదుల కాల్పుల్లో శ్రీకాకుళం జవాను మృతి
author img

By

Published : Oct 23, 2020, 11:29 AM IST

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరుకు చెందిన అసోం రైఫిల్స్‌ జవాను బొంగు బాబూరావు (28) ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఖోన్సా సరిహద్దు సమీపంలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో బాబూరావు మరణించినట్లు అధికారులు వెల్లడించారని కుటుంబసభ్యులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం 1.40 గంటలకు జవాను భౌతికకాయం విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంది. కాశీబుగ్గ దరి తాళభద్ర నుంచి అక్కుపల్లి మీదుగా స్థానిక యువకులు ద్విచక్ర వాహన ర్యాలీతో సాయంత్రం స్వగ్రామానికి తీసుకొచ్చారు. బాబూరావుకు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వివాహమైంది. గత నెల చివర్లో విధుల్లోకి వెళ్లి, 21 రోజులు క్వారంటైన్‌లో ఉన్నారు. తిరిగి విధుల్లో చేరిన మూడు రోజులకే అమరుడయ్యారు. శుక్రవారం ఉదయం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు స్థానిక ఎస్‌ఐ గోవిందరావు తెలిపారు.

ఇదీ చదవండి:

ఒక్క రోజు కలెక్టర్​కు 'చంద్రుడు' సాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.