శ్రీకాకుళం జిల్లా పాలకొండ చేనేత కళాకారులు శ్రీశైలం మల్లన్నకు శివరాత్రికి తలపాగా సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే పనులు ప్రారంభించారు. శ్రీశైలం మల్లికార్జున స్వామికి 365 మొలల తలపాగాతోపాటు అమ్మవారికి, వినాయకుడికి ప్రత్యేకంగా వస్త్రాలు తయారు చేస్తున్నారు. పట్టణంలోని చేనేత కార్మికులంతా కలిసి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ ప్రత్యేక వస్త్రాల నేత చేపడుతున్నారు. శివరాత్రి నాటికి శ్రీశైలం చేరేలా నిర్ణయించారు. మూడేళ్లుగా శ్రీశైలం మల్లన్నకు తలపాగా అందించడం ఆనవాయితీగా వస్తోందని చేనేత కార్మికులు చెబుతున్నారు.
శ్రీశైలం మల్లన్న సిక్కోలు తలపాగా
శివరాత్రి సందర్భంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి వారికి శ్రీకాకుళంలోని చేనేత కార్మికులు తలపాగా సిద్ధం చేస్తున్నారు. మూడేళ్లుగా స్వామివారికి తలపాగా అందజేస్తున్నట్లు కార్మికులు వివరించారు.
శ్రీకాకుళం జిల్లా పాలకొండ చేనేత కళాకారులు శ్రీశైలం మల్లన్నకు శివరాత్రికి తలపాగా సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే పనులు ప్రారంభించారు. శ్రీశైలం మల్లికార్జున స్వామికి 365 మొలల తలపాగాతోపాటు అమ్మవారికి, వినాయకుడికి ప్రత్యేకంగా వస్త్రాలు తయారు చేస్తున్నారు. పట్టణంలోని చేనేత కార్మికులంతా కలిసి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ ప్రత్యేక వస్త్రాల నేత చేపడుతున్నారు. శివరాత్రి నాటికి శ్రీశైలం చేరేలా నిర్ణయించారు. మూడేళ్లుగా శ్రీశైలం మల్లన్నకు తలపాగా అందించడం ఆనవాయితీగా వస్తోందని చేనేత కార్మికులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: అరసవల్లి సూర్యదేవాలయం.. స్వామివారి నిజరూప దర్శనం