రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్ నియంత్రణ చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు హితవు పలికారు. రాష్ట్రంలో తీవ్రరూపం దాల్చుతున్న కరోనాను నివారించేందుకు వ్యవస్థలో లోపాలు సరిదిద్దకుంటే నష్టపోయేది ప్రజలే కానీ, చంద్రబాబు, తెదేపా నేతలో కాదనే విషయం వైకాపా నేతలు గ్రహించాలని కోరారు. జగన్ రాజకీయాలు మాని కొవిడ్ నివారణ.. మౌలిక సదుపాయాలుపై దృష్టి సారిస్తే సంక్షోభాన్ని అరికట్ట వచ్చని చెప్పారు. మంత్రులు రాజకీయ విమర్శలకే ప్రాధాన్యమిచ్చుకుంటూ పోతే ఇక రాష్ట్రం బాగుపడే ప్రసక్తే లేదన్నారు. 104, 108 వ్యవస్థల్ని సరిదిద్దేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలో ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రధానికి లేఖ రాసినట్లు చెప్పారు.
ఇదీ చదవండి: ఎన్ని అక్రమ కేసులు పెడతారో పెట్టుకోండి.. నేను రెడీ: లోకేశ్