గ్రామ సచివాలయంలో పౌర సేవలు మరింత పెంచకుంటే.. ఎదురయ్యే ఫలితాలకు సచివాలయ సిబ్బందే బాధ్యత వహించాల్సి ఉంటుందని శ్రీకాకుళం సంయుక్త కలెక్టర్ శ్రీనివాసులు హెచ్చరించారు. శనివారం సాయంత్రం నరసన్నపేట నియోజకవర్గంలోని ఉర్లాం, గొటివాడ, బుడితి తదితర సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
రికార్డుల నిర్వహణ, సిబ్బంది హాజరు, పౌర సేవలు తదితర అంశాలను నిశితంగా పరిశీలించారు. జలుమూరు మండలం గొటివాడ సచివాలయంలో పని చేస్తున్న సిబ్బంది తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సంబంధిత కార్యదర్శి తో పాటు జలుమూరు ఎంపీడీఓలకు నోటీసులు జారీ చేశారు. తీరు మార్చుకోవాలన్నారు.
ఇదీ చదవండి: