కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ సుమిత్‌కుమార్ అన్నారు. పాలకొండ ప్రభుత్వాసుపత్రిని సందర్శించిన ఆయన కొవిడ్ పరీక్షల గురించి ఆస్పత్రి సూపరింటెండెంట్ రవీంద్ర కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ను సందర్శించారు. బస్టాండ్‌లో ప్రయాణికులు భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించేలా చూడాలని ఆర్టీసీ డిపో మేనేజర్ వైఎస్ఆర్ మూర్తిని ఆదేశించారు.
ఇదీచదవండి.