శ్రీకాకుళం నగరంతో పాటు ఆమదాలవలస, గార, సీతంపేట, బూర్జ, భామిని, సరుబుజ్జిలి, పోలాకి, కాశీబుగ్గ, వజ్రపుకొత్తూరు మండలాల్లో వానలు పడుతున్నాయి. మిగిలిన చోట్ల తేలికపాటి వర్షం పడుతోంది. సముద్ర తీర ప్రాంతంల్లో గాలులు వీస్తున్నాయి. వానల ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాల కారణంగా నాగావళి, వంశధార పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాగం సూచించింది. జిల్లాలోని ప్రజలు నదులను దాటే ప్రయత్నం చేయరాదని కోరింది.
ఇదీ చూడండి