ETV Bharat / state

ఎక్కడికక్కడ అప్రమత్తం ! ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు

author img

By

Published : Jun 11, 2020, 1:01 PM IST

శ్రీకాకుళం జిల్లాలోని పలు ముఖ్య ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా వ్యాప్తి కట్టడికి పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల నమూనాల సేకరణ పెంచిన నేపథ్యంలో వాటి ఫలితాలు వస్తుండటంతో అందుకు తగ్గట్లు కార్యాచరణకు చేపడుతున్నారు. పలాస, కొత్తూరు, సోంపేట మండలాల్లో కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు.

srikakulam district corona
శ్రీకాకుళం జిల్లాలో కరోనా కేసులు

కరోనా పరీక్షలు పెంచిన నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలోని సోంపేట మండలం బారువ మేజర్‌ పంచాయతీకి ఇటీవల హైదరాబాద్‌ నుంచి నలుగురు రైలులో వచ్చారు. వీరిని ఉన్నత వైద్య పరీక్షల నిమిత్తం శ్రీకాకుళం తరలించారు. వారితో సన్నిహితంగా ఉన్న మరో ఆరుగురు కుటుంబసభ్యులను శ్రీకాకుళం క్వారంటైన్‌ కేంద్రానికి పంపించారు. ట్రైనీ కలెక్టర్‌ బి.నవీన్‌ ఆధ్వర్యంలో టెక్కలి ఆర్డీవో ఐ.కిషోర్‌, సోంపేట తహసీల్దార్‌ ఎస్‌.గురుప్రసాద్‌, ఆర్‌ఐ గాయిత్రి, ఈవో వరప్రసాద్‌, ఆరోగ్య కార్యకర్తలు ఇక్కడ ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు.

బారువలో దుకాణాలు, వ్యాపార సంస్థలు మూసివేశారు. సంబంధిత కుటుంబ సభ్యులు హోటల్‌ నిర్వాహకులు అయినందున.. 3 రోజులుగా హోటల్‌కు వెళ్లినవారి వివరాలు సేకరిస్తున్నారు. క్వారంటైన్‌కు తరలించిన వారితో 200 మంది వరకూ సన్నిహితులుగా ఉండొచ్చని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

కొత్తూరుకు చెందిన ముగ్గురిని శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించారు. వీరు ఈ నెల 6న హైదరాబాద్‌ నుంచి రైలులో వచ్చారు. శ్రీకాకుళం రోడ్‌ రైలు నిలయంలో పరీక్షలు నిర్వహించి హోం క్వారంటైన్‌లో ఉంచారు. వీరుంటున్న వీధిలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు.

ఇవీ చదవండి...

కరోనా ఉందని తెలియక ఆపరేషన్.. క్వారంటైన్​కు వైద్యులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.