Srikakulam 9 students fall sick: శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం కిలాంతర్ గ్రామానికి చెందిన 9 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆ గ్రామంలో పాఠశాల లేకపోవడంతో విద్యార్థులంతా పక్కనే ఉన్న అల్లిన గ్రామంలోని పాఠశాలకు వెళ్తున్నారు. ఎప్పటిలాగే పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు వారిని పాలకొండ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులంతా ఆరోగ్యంగానే ఉన్నట్టు.. ఆసుపత్రి సూపరిండెంట్ రవీంద్ర కుమార్ తెలిపారు. తమ గ్రామంలో పాఠశాల ఉంటే ఇటువంటి పరిస్థితులు పునరావృతం కావని, తమ గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. విద్యార్థుల అస్వస్థతకు గల కారణాలు కనుక్కొగా.. తమ గ్రామం నుంచి వచ్చే సమయంలో.ఓ చెట్టు నుంచి బాదం కాయల్ని పోలిన పండ్లను కోసుకుని తిన్నారని వాటి కారణంగా అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి: