ఆమదాలవలసలో ప్రస్తుతం ఉన్న క్రీడా మైదానంలో క్రికెట్ స్టేడియం నిర్మాణం కొనసాగుతోందని సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. 11 ఎకరాలలో క్రికెట్ స్టేడియం రావడం సంతోషదాయకమన్న సీతారాం.. ఆమోదించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, కేబినెట్ మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్ర క్రికెట్ సంఘం ఎప్పటి నుంచో స్టేడియం నిర్మాణానికి ఆలోచిస్తోందని చెప్పారు. కార్యరూపం దాల్చేందుకు రాష్ట్ర బాలుర క్రికెట్ సంఘం అధ్యక్షులు తమ్మినేని చిరంజీవి నాగ్ కృషి చేశారని చెప్పారు. క్రికెట్ స్టేడియం నిర్మాణానికి అవసరమైన ప్రణాళికలు, బడ్జెట్ రూపకల్పన చేస్తారని పేర్కొన్నారు. అలాగే ఆమదాలవలసలో ఇండోర్ స్టేడియం రావడానికి కృషి చేస్తున్నామని చెప్పారు.
ఇదీ చదవండి:
సీఎం జగన్ లేఖ అంశంలో దాఖలైన పిటిషన్లపై 16న 'సుప్రీం' విచారణ