శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం తోటవాడ గ్రామంలో సభాపతి సీతారాం గ్రామ సచివాలయం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏ ప్రభుత్వం చేయలేకపోయిందని అన్నారు. గతంలో ఏ సమస్య ఉన్నా ప్రజలు మండల కేంద్రానికి వెళ్లేవారిని... ఇక నుంచి ఆ సమస్య లేకుండా గ్రామ సచివాలయంలోనే పరిష్కారమయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులను అవమానిస్తే కఠిన చర్యలు తప్పవు...
ప్రభుత్వ ఉద్యోగులు ఏ స్థాయిలో ఉన్న వారిని అవమానపరచడం, బండ బూతులతో తిట్టడమనేది... సంస్కారం లేనివారు మాత్రమే చేస్తారని సభాపతి అన్నారు. బాధ్యత గల అధికారులు ప్రజలకు సేవ చేసేందుకే ఉన్నారని ...అటువంటి వారిని అవమానపరిస్తే ఎంతటివారినైనా ప్రభుత్వం కచ్చితంగా శిక్షిస్తుందన్నారు. ఇప్పటికే ఈ సమస్యను ఉద్యోగ సంఘాలు తమ దృష్టికి తీసుకు వచ్చాయని తెలిపారు.