శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా రెండు రోజుల పాటు జరిపిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో 98 మంది బాలలను గుర్తించామని ఎస్పీ అమిత్ బర్దార్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా అధికారులకు, పిల్లల తల్లిదండ్రులకు దిశానిర్ధేశం చేశారు. వీధి బాలలు, అనాథలతో పాటు నిరాదరణకు గురైన పిల్లల పరిరక్షణ, వారు కరోనా వైరస్ బారినపడకుండా ఉండేందుకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఇలా చాలా చోట్ల కార్మికులుగా మగ్గుతున్న బాలల కోసం పోలీసులు జల్లెడపట్టి విముక్తి కల్పించారన్నారు. చదువుకోవాల్సిన వయసులో తల్లిదండ్రుల సంరక్షణ లేక రోడ్లపై తిరుగుతూ హోటళ్లు, రెస్టారెంట్ల్లో, బట్టల దుకాణల్లో పనులు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్న బాలలను గుర్తించామని ఎస్పీ తెలిపారు.
ఇదీ చదవండీ...