శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం ఉర్గాంలో చిత్రమైన సంఘటన జరిగింది. ఒక సర్పాన్ని మరొక సర్పం కాపాడుతున్న దృశ్యం ఈటీవీ భారత్ కెమేరాకు చిక్కింది. ఉర్గాం సాయివీధిలో పోలాకి వెంకటరాజు అనే వ్యక్తి ఇంటి ఆవరణలో ఒక నాగుపాము రాళ్లకింద చిక్కుకుని బయటకు రాలేకపోయింది. కొన్ని గంటలపాటు ఆ బండల కిందే ఉండిపోయింది. విషసర్పం అయినందున దాన్ని రక్షించేందుకు మనుషులు సాహసం చేయలేకపోయారు. అయితే.. తన మిత్రుణ్ని కాపాడుకునేందుకు మరో పెద్ద పాము వచ్చింది. రాళ్లకింద చిక్కుకున్న సర్పం తలను తన నోటిలో పెట్టుకుని కొంచెం కొంచెంగా బయటకు లాగింది. సుమారు గంటపాటు శ్రమించి తన సహచరున్ని రక్షించుకుంది. చుట్టూ జనాలు గుమిగూడినా ఏమాత్రం బెదరకుండా స్నేహితున్ని కాపాడుకుంది.
ఇవీ చదవండి..