శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం కట్యాచార్యులపేటలో సభాపతి తమ్మినేని సీతారాం అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ గ్రామంలో గతంలో మూసివేసిన పాఠశాలతో పాటు ధాన్యం కోనుగోలు క్రేందాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో అధికారుల పనితీరును తప్పుబడుతూ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల వద్ద ధాన్యం ఎందుకు కొనుగోలు చేయలేదని పీఏసీఎస్, వెలుగు, డీసీఎంఎస్, వ్యవసాయశాఖ అధికారులకు చురకలు అంటించారు.
ఇదీ చదవండి:రాజధానిపై సీఎంకు అందిన బోస్టన్ నివేదిక