వర్ధమాన సినీ దర్శకుడు వట్టి కుమార్(38) శుక్రవారం సాయంత్రం కరోనా మృతి చెందారు. శ్రీకాకుళంలోని రాగోలు జెమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పదేళ్లుగా ఆయన హైదరాబాదులో ఉంటూ సినీ పరిశ్రమలో పనిచేస్తున్నారు. నరసన్నపేట బండివీధికి చెందిన కుమార్ తొలుత ఎడిటర్‌గా సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. అనంతరం అంచెలంచెలుగా ఎదిగారు. సహాయ దర్శకుడిగా పలు చిత్రాలకు పని చేసిన కుమార్ బలగ ప్రకాశ్ నిర్మించిన ‘మా అబ్బాయి’ చిత్రానికి నేరుగా దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు.
ప్రస్తుతం కుమార్ ‘సర్కారువారి పాట’ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. వట్టి కుమార్‌కు తల్లి, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. తండ్రి సూర్యలింగం రెండేళ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందారు.
ఇదీ చదవండి: అమరరాజా బ్యాటరీస్‌కు ఏపీపీసీబీ నోటీసులు.. ఆ ప్లాంట్లు మూసేయాలని ఆదేశం