శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం సీతంపేట మండలంలోని మూడు కోట్లతో నిర్మించే రహదారులను ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి ప్రారంభించారు. గత ప్రభుత్వం గిరిజనులను పట్టించుకోకుండా నాలుగున్నరేళ్లు గడిపారని... కానీ సీఎం జగన్ మాత్రం గిరిజనుల సంక్షేమమే లక్ష్యంగా పాటుపడుతున్నారని పేర్కొన్నారు.
జిల్లాలో ఐదు పంచాయతీలను షెడ్యూల్ ఏరియాలో చేర్చకపోవడంపై చర్యలు తీసుకుంటామని హామీఇచ్చారు. గిరిజనుల కోసం పోరాడేందుకు తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలిపారు.
ఇదీ చదవండి: ఇవాళ సీఎం జగన్తో సినీ ప్రముఖుల భేటీ