శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సమీపంలో వ్యాన్ ఢీకొని రిమ్స్‌లో పనిచేస్తున్న హెడ్ నర్సు మృతి చెందింది. హెడ్ నర్సు భానుమతి బరోడా తన విధులు ముగించుకొని భర్తతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా... వెనుకనుంచి వాహనం వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడటంతో వెంటనే శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.
ఇదీ చదవండి: 'ఆ కరోనా రోగికి ప్లాస్మా థెరపీ విజయవంతం!'