శ్రీకాకుళంలో 71వ గణతంత్ర వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరిగిన రిపబ్లిక్‌డే సంబరాల్లో కలెక్టర్ నివాస్ పతాకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో స్వాతంత్య్ర సమరయోధులతో పాటు అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. కలెక్టర్, ఎస్పీలకు ఎచ్చెర్ల రిజర్వు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. జిల్లాకు చెందిన వివిధ శాఖల్లో ప్రతిభ కనపరచిన అధికారులు, సిబ్బంది, స్వచ్ఛందసంస్థల ప్రతినిధులకు పురస్కారాలు అందజేశారు.
ఆమదాలవలసలో...
ఆమదాలవలసలో ఘనంగా గణతంత్ర వేడుకలు జరిగాయి. ప్రభుత్వ కార్యాలయాల్లోని అధికారులు, విద్యార్థులు, ఇతర సిబ్బంది జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు.
పాతపట్నంలో...
పాతపట్నం మండలంలో గణతంత్ర సంబరాలు ఘనంగా జరిగాయి. మహేంద్ర విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో సరిలేరు నీకెవ్వరు సినిమా నటుడు కుమరన్ సేతు రామన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జెండా ఎగురవేశారు. పాతపట్నంతో పాటు పలు గ్రామాలకు చెందిన విశ్రాంత సైనికులు, ఉద్యోగులను ఘనంగా సన్మానించారు.
ఇవీ చదవండి