శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని లావేరు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద అదపాక గ్రామానికి చెందిన రెల్లి కులస్తులు ధర్నా చేశారు. జిల్లా కుల వివక్ష వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో గృహ నిర్మాణాల కోసం పొజిషన్ సర్టిఫికేట్( నివాస స్థల ధ్రువీకరణ పత్రం) మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ఇల్లు మంజూరైనా పొజిషన్ సర్టిఫికేట్ లేకపోవటంతోనే ఇల్లు కట్టుకోలేకపోయామని వాపోయారు. జిల్లా కుల వివక్ష వ్యతిరేక పోరాట కమిటీ ప్రధాన కార్యదర్శి డి.గణేష్ మాట్లాడుతూ కేవలం రాజకీయంగా కక్షసాధింపు కోసమే ఇళ్ల స్థలాలకు ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయడం లేదని ఆరోపించారు. అనంతరం తహసీల్దార్ ఎస్.రమణయ్యకు వినతిపత్రం అందించారు. గ్రామంలో పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించి లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేస్తామని తహసీల్దార్ తెలిపారు.
ఇదీ చూడండి: వంశధార నదిలో ప్లకార్డులతో రైతుల ఆందోళన