ETV Bharat / state

'అమరావతి రైతులకు అన్యాయం చేస్తే సహించేది లేదు'

రాష్ట్ర రాజధాని కోసం అమరావతి రైతులకు మద్దతుగా శ్రీకాకుళం జిల్లాలో తెదేపా నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు. అమరావతి రైతులకు అన్యాయం చేస్తే సహించేది లేదని ప్రభుత్వానికి హెచ్చరించారు.

Rallies in support of Amravati in Srikakulam
శ్రీకాకుళంలో అమరావతికి మద్దతుగా ర్యాలీలు
author img

By

Published : Oct 12, 2020, 9:17 PM IST

రాష్ట్ర రాజధాని కోసం అమరావతి రైతులు చేసిన త్యాగాలు గొప్పవని తెదేపా నాయకుడు మాజీ ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి అన్నారు. అమరావతి రైతుల ఉద్యమం 300 రోజులు గడిచిన నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సంఘీభావంగా నిరసన ప్రదర్శన చేశారు. అమరావతి రైతులకు అన్యాయం చేస్తే సహించేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం తాహసీల్దార్​కు వినతి పత్రం అందజేశారు.

ఆమదాలవలస బూర్జ సరుబుజ్జిలి పొందూరు మండలాల్లో తెదేపా నాయకులు అమరావతి రైతులకు మద్దతుగా తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. అమరావతిని నిర్మించేందుకు రైతులు ముందుకు వచ్చి భూములు ఇస్తే వైకాపా ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేస్తుందని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు తమ్మినేని సుజాత, మాజీ జడ్​పీటీసీ నెపు రామకృష్ణ, తెదేపా నాయకులు తమ్మినేని విద్యాసాగర్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

అప్పన్న ఆలయంలో వస్తువుల మాయంపై దర్యాప్తు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.