ఇవి చూడండి...
వైద్యుల నిర్లక్ష్యం... శిశువు మృతి.. బాధితుల ఆందోళన - శ్రీకాకుళం జిల్లా
వైద్యుల నిర్లక్ష్యం కారణంగా... శ్రీకాకుళం జిల్లా రాజాం ఆసుపత్రిలో శిశువు మృతి చెందింది. ఈ దారుణానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. బిడ్డ చనిపోవడానికి కారణమైన వైద్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వైద్యుల నిర్లక్ష్యంతో బిడ్డ మృతి
శ్రీకాకుళం జిల్లా రాజాం సామాజిక ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా శిశువు మృతి చెందింది. రాజాం మల్లికార్జున కాలనీకి చెందిన ఉప్పల శ్రీనివాసరావు, సావిత్రి దంపతుల కుమార్తె త్రివేణిని విజయనగరం రైల్వే కాలనీకి చెందిన కాలెపు నాగేశ్వరరావుకు ఇచ్చి వివాహం చేశారు. తొలి కాన్పు నిమిత్తం కన్నవారింటికి వచ్చిన త్రివేణికి పురిటి నొప్పులు ఎక్కువగా కావడంతో... రాజాం ప్రాంతీయ ఆసుపత్రిలో గురువారం రాత్రి ఒంటిగంటకు చేర్పించారు. శుక్రవారం తెల్లవారుజామున ఐదు గంటల పది నిమిషాలకు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. త్రివేణికి బిడ్డ పుట్టిన సంతోషం ఎక్కువ రోజులు ఉండలేదు. ఆదివారం ఉదయం బిడ్డ చనిపోయిందని వైద్యులు చెప్పడంతో... కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ దారుణానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. బిడ్డ చనిపోవడానికి కారణమైన వైద్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవి చూడండి...
Intro:అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో జనసేన ప్రచారం రోజు రోజుకు ఊపు అందుకుంటోంది. అనంతపురం ఎంపీగా పోటీ చేస్తున్న సీపీఐ జగదేశ్, తాడిపత్రి నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కదిరి శ్రీకాంత్ రెడ్డిలు సిపిఐ, సిపిఎం, సిఐటియు కార్యకర్తలతో కలిసి పట్టణంలోని పోలీస్ స్టేషన్ కూడలి నుంచి గాంధీ కట్ట వరకు ఉన్న దుకాణాలలో తిరుగుతూ ఎంపీ అభ్యర్థి గుర్తు కంకి కొడవలి, ఎమ్మెల్యే అభ్యర్థి గుర్తు గ్లాసు అని చెప్పి ప్రతి ఒక్కరు కూటమినే గెలిపించాలని అన్నారు. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటాలు చేసే మాకు మాత్రమే ఓటు అడిగే నైతిక హక్కు ఉందని జగదీష్ పేర్కొన్నారు. కానీ ఇక్కడ రాజకీయాలు కేవలం వారసత్వపు హక్కుగా వస్తున్నాయని అన్నారు. ఇలాంటి వాటికి ప్రజలంతా వ్యతిరేకించి కూటమిని అఖండ మెజారిటీతో గెలిపించాలని అన్నారు. తాము అధికారంలోకి వస్తే మహిళలకు సంవత్సరం పొడుగునా ఉచిత గ్యాస్ సిలిండర్లు, ప్రతి రైతుకు గిట్టుబాటు ధర, ప్రత్యేక మంత్రిత్వ శాఖ, ప్రతి మండలంలో 30 పడకల ఆసుపత్రి, ఒకటో తరగతి నుంచి పీజీ వరకు ఉచిత విధ్య అందిస్తామని అన్నారు. ఈ ప్రచారంలో సిపిఐ పట్టణ కార్యదర్శి చిరంజీవి, సహాయ కార్యదర్శి నాగేంద్ర, నాయకులు నరసింహారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, ఉమాగౌడ్, జనసేన కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Body:ప్లేస్: తాడిపత్రి, అనంతపురం
కిట్ నెంబర్: 759
7799077211
7093981598
Conclusion:కూటమి అనంతపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి జగదీశ్
Body:ప్లేస్: తాడిపత్రి, అనంతపురం
కిట్ నెంబర్: 759
7799077211
7093981598
Conclusion:కూటమి అనంతపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి జగదీశ్
Last Updated : Mar 31, 2019, 11:29 PM IST