శ్రీకాకుళం జిల్లాలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. జిల్లా అంతటా దట్టమైన మేఘాలతో పాటు.. ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. సరుబుజ్జిలి మండలం పాలవలసలో పిడుగుపడి గొర్రెల కాపరి మృతి చెందారు.
శ్రీకాకుళం, వీరఘట్టం, ఆమదాలవలస, సీతంపేట, కొత్తూరు, భామిని, రాజాం, రేగిడి, వంగర, సంతకవిటి, పాలకొండ, జలుమూరు, సారవకోట తదితర మండలాల్లో భారీ వర్షం కురిసింది. వర్షానికి తోడైన ఈదురు గాలులు.. మొక్కజొన్న, అరటి తోటలను నేలకూల్చాయి. కూరగాయల పంటలతో పాటు మామిడి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.
ఇవీ చూడండి: