ETV Bharat / state

శ్రీకాకుళం రోడ్ - సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలు..

పండగ సందర్భంగా శ్రీకాకుళం రోడ్ - సికింద్రాబాద్ స్టేషన్ల మధ్య ప్రత్యేక రైలును నడపనున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. ఇది విశాఖ ప్రధాన స్టేషన్​కు రాదని.. ప్రయాణికులు గమనించాలని సూచించింది. రైలు ప్రయాణ మార్గ వివరాలను స్పష్టం చేసింది.

author img

By

Published : Jan 6, 2021, 10:42 PM IST

festival special trains
శ్రీకాకుళం రోడ్- సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలు

శ్రీకాకుళం రోడ్ - సికింద్రాబాద్ స్టేషన్ల మధ్య పండగ ప్రత్యేక రైలు నడపనున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. ఈనెల 8 నుంచి 16 వరకు సికింద్రాబాద్ నుంచి ప్రతీ రోజు సాయంత్రం ఏడు గంటలకు ఈ ప్రత్యేక రైలు ప్రారంభమౌతుందని వెల్లడించింది. ఒక్క 14 వ తేదీన మాత్రం ఈ రైలు సర్వీసు ఉండదని స్పష్టం చేసింది. సికింద్రాబాద్ నుంచి బయలు దేరి మరుసటి రోజు ఉదయం 5.30 గంటలకు దువ్వాడకు చేరుకుని.. అక్కడి నుంచి శ్రీకాకుళం రోడ్​కు ఉదయం 8.30 గంటలకు చేరుకుంటుందని తెలిపారు.

తిరుగు ప్రయాణంలో రైలు 9 నుంచి 17 వరకు నడుస్తుందని.. మధ్యలో 15వ తేదీన మాత్రం ఈ సర్వీసు ఉండదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. శ్రీకాకుళం రోడ్​లో సాయంత్రం 3:30కి బయలుదేరి దువ్వాడకు సాయంత్రం 6:30కు చేరుకుని.. మరుసటి రోజు ఉదయం 6.55 గంటలకు సికింద్రాబాద్​కు తిరిగి చేరుతుందని తెలిపింది. చీపురుపల్లి, విజయనగరం, కొత్తవలస, పెందుర్తి, దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లి గూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా సికింద్రాబాద్​కు చేరుకుంటుందని వివరించింది. ఈ రైలు ప్రయాణంలో భాగంగా విశాఖ ప్రధాన స్టేషన్​కు రాదని.. ప్రయాణీకులు గమనించాలని సూచించింది.

ఇదీ చదవండి: మంత్రి అవంతి కాన్వాయ్​ అడ్డగింత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.