శ్రీకాకుళం జిల్లా కరోనా వైరస్ రహిత జిల్లాగా కొనసాగుతుండటంతో... జిల్లాలో అధికారులు లాక్ డౌన్‌ను మరింత పటిష్టంగా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మండల సరిహద్దుల్లో ప్రత్యేక సూచికలు పెట్టి ఇతర ప్రాంతాల వారు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. జిల్లా సరిహద్దులు సైతం మూసివేశారు. నరసన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మడపాం, జమ్ము కూడలి, దేశవానిపేట తదితర ప్రాంతాల్లో నిఘా పెంచినట్టు పోలీసులు ప్రకటించారు. ఎవరైనా మండలంలోకి రావాలంటే ముందస్తు అనుమతులు పొందాలని తహసీల్దార్ ప్రవల్లిక ప్రియ సూచించారు.
ఇదీ చదవండి: