రంజాన్సం దర్భంగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట జామియా మసీదులో ప్రార్థనలు చేపట్టకుండా పోలీసులు అడ్డుకున్నారు. మసీదులో ప్రార్థనలు చేసేందుకు అనుమతి లేనందున.. మసీదు లోపలకు ఎవరినీ అనుమతించలేదు. అప్పటికే కొందరు ముస్లింలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ప్రార్థనలు చేసేందుకు ప్రయత్నించగా.. మత పెద్దలు రాకపోవటంతో.. వారు నిరాశతో వెనుదిరిగారు. కొద్దిసేపు రహదారిపై వేచి ఉన్న వారు పోలీసుల సూచన మేరకు స్వస్థలాలకు వెళ్లారు. శ్రీకాకుళం ఆర్డీవో కిషోర్ మసీదును పరిశీలించారు. మధ్యాహ్నం వరకు పోలీసులు పహారా నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.
ఇవీ చూడండి…: ఉరుముల బీభత్సం.. ఈదురుగాలులతో భారీ వర్షం