ETV Bharat / state

సంక్రాంతికి ముందే కోడిపందాలు.. పోలీసుల ఎంట్రీతో.. - ఏపీలో సంక్రాంతి పండగపై వార్తలు

Cockfighting In Srikakulam: సంక్రాంతి పండుగ నేపథ్యంలో కోడిపందాల శిబిరాలపై శ్రీకాకుళం జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపారు. తోటలలో కోడిపందాలను నిర్వహిస్తున్నారనే సమాచారంతో కోడి పందాల శిబిరంపై దాడిచేసి 7 పుంజులతో పాటు.. 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఎక్కడైనా కోడిపందాలు నిర్వహించినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Cockfighting ring
కోడిపందాలు
author img

By

Published : Jan 9, 2023, 5:14 PM IST

Updated : Jan 9, 2023, 6:55 PM IST

Police Arrested 17 people Cockfighting Ring: సంక్రాంతి అంటే వెంటనే గుర్తుకు వచ్చేవి, మహిళలు ఇళ్లముందు వేసే ముగ్గులు, యువకులు పోటీపడి మరీ ఆడే కోడిపందాలు. అయితే, కోడిపందాలపై కోర్టు ఆదేశాలతో ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే.. ప్రతియేడు పండగ సమయంలో ఆచారాలను కాలరాస్తున్నారంటూ ఆయా ప్రాంతాల ప్రజలు.. ప్రభుత్వం తీరును వ్యతిరేకించడం పరిపాటిగా వస్తోంది. పోలీసులు మాత్రం కోడిపందాలపై నిఘా పెట్టి వాటిని నిరోధించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఎలాంటి ఆంక్షలు పెట్టినా... సంక్రాంతి సమయంలో వాటిని అడ్డుకోలేకపోతున్నారు. అలా కోడిపందాలను నిర్వహిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది.

ఇచ్చాపురం నియోజకవర్గంలోని కంచిలి మండలంలో సంక్రాంతి పండుగ రానున్న నేపథ్యంలో కోడిపందాలు నిర్వహిస్తున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని, కోళ్లను స్వాధీనం చేసుకొన్నారు. కంచిలి జాతీయ రహదారిపై అంపురం గ్రామ పరిసరాలలో ఉన్న తోటలలో కోడిపందాలను నిర్వహిస్తున్నారని సమాచారం అందిందని కంచిలి ఎస్సై చిరంజీవి తెలిపారు. వెంటనే కోడిపందాల శిబిరంపై దాడి చేశామని తెలిపారు. కోడి పందాలు నిర్వహిస్తున్న, పందెంలో పాల్గొన్న 17 మందిని అదుపులోకి తీసుకుని.. 21 వేల రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. కోడి పందాలను నిర్వహించడానికి తీసుకువచ్చిన ఏడు కోడిపుంజులను పోలీసులు స్వాధీనం చేసుకున్నామన్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఎక్కడ కోడిపందాలు నిర్వహించినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు. కోడిపందాల నిర్వహణకు సంబంధించిన సమాచారం అందించాలని తెలిపారు.

కోడిపందాల శిబిరాలపై పోలీసుల ఉక్కు పాదం

'మాకు వచ్చిన సమాచారంతో మామిడి తోటలో కోడిపందాలు నిర్వహిస్తున్నారని తెలిసింది. మా టీమ్ అంతా కలిసి దాడి చేసి ఏడు కోడి పుంజులను పట్టుకున్నాం. కోడిపందాలలో పాల్గొన్న 17 మందిని అదుపులోకి తీసుకున్నాం. ఇలాంటి కోడిపందాలపై సమాచారం ఇస్తే నిర్వాహకులపై చర్యలు చేపడతాం. కోడిపందాలతో పాటుగా పేకాట, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిఘా పెట్టడం జరుగుతుంది. సంక్రాంతికి ఇలాంటి పోటీలను నిర్వహిస్తున్నారని తెలిసింది. అలాంటివి చట్టవిరుద్ధం'- చిరంజీవి, ఎస్సై

ఇవీ చదవండి:

Last Updated : Jan 9, 2023, 6:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.