శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో మున్సిపల్ చైర్ పర్సన్‌గా పిలక రాజ్యలక్ష్మిని ఎన్నుకొన్నారు. వైస్ చైర్ పర్సన్‌గా ఉలాల భారతి దివ్య ఎంపికయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా పార్టీ 23 వార్డుల్లో పోటీచేసి 15 స్థానాల్లో విజయం సాధించగా.. రెండు చోట్ల ఇతరులు గెలుపొందారు. గెలిచిన ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు వైకాపాకు మద్దతివ్వటంతో.. ఆ సంఖ్య 17కు పెరిగింది. పిలక పోలవరం కోడలు పిలక రాజ్యలక్ష్మి రెండోసారి మున్సిపల్ చైర్ పర్సన్‌గా ఎన్నికయ్యారు. గురువారం మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో.. 23 మంది కౌన్సిలర్లు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం చైర్పర్సన్ అభ్యర్థిని ఎన్నుకొన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి ధర్మాన కృష్ణదాస్ పాల్గొని.. చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్ అభ్యర్థి భారతి దివ్యకి అభినందనలు తెలిపారు.
ఇవీ చూడండి...: వెల్పేర్ ఆఫీసర్ మృతి.. కరోనా టీకా వికటించిందా?