Pangolin Smuggling Gang Arrested: శ్రీకాకుళం జిల్లా పలాస కేంద్రంగా వన్యప్రాణుల రవాణా చేస్తున్న ముఠా గుట్టును అటవీ అధికారులు రట్టుచేశారు. మందస మండలం బొందుకారికి చెందిన సవర కోదండరావు, కాశీబుగ్గకు చెందిన బమ్మిడి రవితేజ, నర్సీపురానికి చెందిన యలమల సాయికిరణ్, ఒడిశా చెందిన సనపల రుషి అనే నిందితులు అని అధికారులు వెల్లడించారు. అయితే వీరు రెండు అలుగులను పట్టుకొచ్చి కాశీబుగ్గలో అమ్మేందుకు సిద్ధమై ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని అటవీ అధికారులు తెలిపారు. అలాగే నిందితుల్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లుగా వివరించారు.
ఇవీ చదవండి: