శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో నాలుగో విడత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. రణస్థలం 31, ఎచ్చెర్ల 26, జి.సిగాడంలో 31 పంచాయతీలు ఉన్నాయి. మొత్తం 888 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. ప్రస్తుతం ఈ మూడు మండలాల్లో నామినేషన్లు ఊపందుకున్నాయి.
పత్రాలు సమర్పించేందుకు వచ్చిన అభ్యర్థుల వెంట మద్దతుగా అనుచరులు భారీగా తరలివెళ్లారు. రణస్థలం, జెఆర్ పురం పంచాయతీల నుంచి సర్పంచ్ అభ్యర్థులుగా పిన్నింటి భానోజీ రావు, కొయ్యాన దివ్యలకు మద్దతుగా తెదేపా రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు వెంట ఉన్నారు.
ఇదీ చదవండి: