శ్రీకాకుళం జిల్లా పలాస - కాశీబుగ్గ పురపాలిక సంఘం ఛైర్మన్ బళ్ల గిరిబాబు వ్యాఖ్యలు హల్‌చల్ చేస్తున్నాయి. 24వ వార్డులో తెదేపా విజయం సాధించటంతో.. వైకాపాకు ఓట్లేయలేదని సంక్షేమ పథకాలను ఆపేస్తునట్లు ఛైర్మన్ గిరిబాబు ఫోన్‌లో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
24వ వార్డుకు సంబంధించిన కొంతమంది జగనన్న విద్యాదీవెన పథకానికి ధరఖాస్తు చేసే క్రమంలో.. వాలంట్లీర్లు సంతకం పెట్టడంలేదని బాధితులు వాపోయారు. ఛైర్మన్ బళ్ల గిరిబాబుకు ఫిర్యాదు చేయగా.. తానే సంక్షేమ పథకాలను ఆపేయమని చెప్పినట్లు తెలిపారు. దీంతో బాధితులు పురపాలిక సంఘం కార్యాలయం వద్ద బైఠాయించారు. కమిషనర్ సెలవులో ఉన్నందున ఎవరికి చెపాలో తెలియక.. బాధితులంతా మీడియాను అశ్రయించారు.
ఇదీ చదవండి: